HomeTelugu politics

కెసిఆర్ హుజూర్ నగర్ సభ రద్దు
Published By :  Ravi Koneri Image Image
KCR Huzur Nagar election meeting cancelled due to rain
Thursday Oct 17, 2019
హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభ రద్దయింది. ఎలాగైనా హుజూర్ నగర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్న కెసిఆర్ ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, సర్వం సిద్ధమైన వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ పర్యటన రద్దు కావాల్సి వచ్చింది. 

హుజూర్ నగర్ సభకు వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ నుంచి అనుమతి దొరకలేదు. పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  రోడ్డు మార్గంలో ఉరుములు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్యటన రద్దు అయినట్లుగా మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించాడు. 

గత కొన్నిరోజులుగా హుజూర్‌ నగర్‌ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎకస్‌, బిజెపిల మధ్యనే పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌కు విజయావకాశాలు బాగానే ఉన్నాయని సమాచారం. అయితే  తిరిగి ఈస్థానాన్నికాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలన్నపట్టుదలతో వుంది. ఇక బిజెపి సైతం ఇక్కడ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

   Politics

   Lifestyle