HomeTelugu politics

జగన్ రైతులను మోసం చేసాడు : పవన్ కళ్యాణ్
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan criticizes AP CM Jagan over YSR Raithu Bharosa
Thursday Oct 17, 2019
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు సీఎం జగన్ మాట ఇచ్చి తప్పాడని , ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేని జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేనాని విమర్శించారు. 

ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 అందిస్తామని నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించిన జగన్.. కేంద్రం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్  అని పవన్ ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. రైతులకు జగన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం రూ.12,500. దీనికి కేంద్ర సాయం రూ.6వేలు కలిపితే రూ.18,500 అవుతుంది. కాబట్టి.. అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్  డిమాండ్ చేశారు. ఒక వేళ అంత మొత్తం ఇవ్వలేకపోతే అందుకు కారణాలను రైతులకు చెప్పాలన్నారు. వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు క్షమపణాలు అడగాలన్నారు.

సీఎం జగన్ మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరులో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.12వేల 500 నుంచి రూ.13వేల 500కు పెంచింది. ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేయనుంది. ఏటా రూ.13వేల 500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. 3 విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తారు. ప్రతీ ఏటా మేలో రూ.7వేల 500, రబీలో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తామని చెప్పారు.