HomeTelugu politics

హేమమాలిని బుగ్గలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
MP roads will soon be like Hema Malini's cheeks, says MP Minister
Thursday Oct 17, 2019
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, బీజేపీ ఎంపీ హేమ మాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి పీసీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన పీసీ శర్మ నోరు జారి ఈ  వ్యాఖ్యలు చేసారు. 

"రాష్ట్రంలో రోడ్లను వాషింగ్టన్‌లోని రోడ్లతో పోటీ పడేలా నిర్మిస్తాం. ఇప్పుడున్న రోడ్లకు ఏమైంది? భారీ వర్షాలు కురిస్తే.. ఏ రోడ్ల పరిస్థితి అయినా ఇంతే. ప్రస్తుతం ఇవి బీజేపీ నేత కైలాశ్‌ విజయవర్గీయ బుగ్గల మాదిరిగా ఉన్నాయి. సీఎం కమలానాథ్‌ ఆదేశాలిచ్చిన 15 రోజుల్లోగా రోడ్లకు మరమ్మతులు చేయిస్తాం. త్వరలోనే బీజేపీ ఎంపీ హేమా మాలిని బుగ్గల్లా మార్చేస్తాం’ అని శర్మ అన్నారు.

అయితే మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పీసీ శర్మ పై విమర్శల వర్షం కురుస్తుంది.

   Politics

   Lifestyle