HomeTelugu politics

ఆర్ధిక మాంద్యం పై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
Nirmala Sitharaman's husband Prabhakar shocking comments on Inflation
Tuesday Oct 15, 2019
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక స్థితి మందగమనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదని. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని పరకాల ప్రభాకర్‌ కొనియాడటం విశేషం.

'బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఓ ‘ యోధుని ‘ గా ఎలా ఉన్నారో.. అలాగే దేశ ఆర్ధిక సంస్కరణల్లో పీవీ కూడా ఉన్నారు ‘ అన్నారాయన. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని, అది రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని.. కానీ ఈ విషయాన్ని పార్టీ ఇంకా గుర్తించడం లేదని పరకాల పేర్కొన్నారు. బీజేపీలోని మేధావి వర్గం ఎంతసేపూ విమర్శలు చేస్తున్నంత మాత్రాన.. అవి ఎకానమీ పురోగమనానికి దారి తీస్తాయా అని ప్రభాకర్ ప్రశ్నించారు.  ది హిందూ పత్రికలో పరకాల ప్రభాకర్ రాసిన ఒక వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఎన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. 

   Politics

   Lifestyle