HomeTelugu politics

వైసీపీ తీర్థం పుచ్చుకున్న జూపూడి ప్రభాకర్
Published By :  Lasya Raghavaraju Image Image
Joopoodi Prabhakar joins YSRCP in presence of YS Jagan
Wednesday Oct 09, 2019
నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని సైకో, కాలకేయుడు అని దూషించిన టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు నిన్న దసరా పర్వదినాన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు.  విజయదసమి రోజున సీఎం జగన్ సమక్షంలో జోపోఒది పార్టీలో చేరారు. జనసేన నేత ఆకుల సత్యనారాయణ కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ఆలోచన ప్రభుత్వ పనితీరు నచ్చి వైసీపీలో చేరానని తెలిపారు. పదేళ్ల ప్రజా సమస్యలపై పోరాటం తరువాత జగన్ సీఎం అయ్యారన్నారు. దళితులకు,గిరిజన,మైనార్టీలకు సీఎం పెద్ద పీట వేశారని కొనియాడారు. నిర్దిష్ట ఆలోచన సరళి లేని మేము గొర్రెల్లగా పక్కదారి పట్టామన్నారు. జగన్ మోహన్ రెడ్డిలో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు జూపూడి. సీఎం జగన్ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. పదవులు ఆశించి పార్టీ మారలేదన్నారు జూపూడి. 

జూపూడి మొదటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగారు..వైఎస్ కారణంగానే ఈ స్థాయికి ఎదిగారు. రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ మరణం తర్వాత జూపూడి జగన్‌తో కలిసి నడిచారు. వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. కానీ 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయన్ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు.