HomeTelugu politics

శివసేన తీర్థం పుచ్చుకున్న దీపాలీ సయ్యద్
Published By :  Lasya Raghavaraju Image Image
Marathi actress Deepali Sayyad joins Sivasena party
Saturday Oct 05, 2019
మహారాష్ట్ర లోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రాతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో శివసేన- బీజేపీ పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి.  తాజా సమాచారం ప్రకారం మరాఠీ సినీనటి దీపాలీ సయ్యద్ ఈ రోజు శివసేన పార్టీలో చేరారు.

శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే, అతని కుమారుడు ఆదిత్య థాక్రేల సమక్షంలో దీపాలీ శివసేన తీర్థం స్వీకరించారు. మరాఠీ సినీనటి అయిన దీపాలీకి ఉద్ధవ్ థాక్రే శివసేన జెండా అందించి పార్టీ సభ్యత్వమిచ్చారు.  తాను అక్టోబరు 21వతేదీన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబ్రా కల్వ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని దీపాలి ప్రకటించారు. 

దీపాలీ శివసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.