HomeTelugu politics

పాకిస్తాన్ ఆహ్వానాన్ని మన్నించిన మన్మోహన్
Published By :  Divya Valluru Image Image
Manmohan Singh set to go Pakistan for Kartarpur Saheb Corridor event
Friday Oct 04, 2019
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ ను కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకిస్తాన్  ఆహ్వానం పంపింది.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబరు ఏడో తేదీన జరుగనుంది. ఈ ఆహ్వానంపై మన్మోహన్ సింగ్ ఇప్పటివరకు ఏ ప్మెరకటన చేయలేదు. 

అయితే తాజా సమాచారం ప్రకారం మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. మ‌న్మోహ‌న్‌తో పాటు పంజాబ్ సీఎం మ‌రీంద‌ర్ సింగ్ కూడా క‌ర్తార్‌పూర్ వెళ్ల‌నున్నారు. ఈ కార్యక్రమానికి మ‌న్మోహ‌న్ వెళ్ల‌డం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు మొద‌ట్లో వెల్ల‌డించాయి. దీనిపై గురువారం మ‌రో క్లారిటీ వ‌చ్చింది. ఆఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాక్‌కు మ‌న్మోహ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తాజాగా తెలిసింది. 

గురునాన‌క్ 550వ జయంతి వేడుక‌ల్లో మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ పాల్గొంటారు.