HomeTelugu politics

భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ పై కేసు నమోదు
Published By :  Divya Valluru Image Image
Police case filed against Bhuma Akhilapriya husband Bhargav Ram
Thursday Oct 03, 2019
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ పై ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.  తనకు చెందిన క్రషర్‌లు ఇవ్వాలంటూ భార్గవ రామ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని శివరామిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు 307, 417, 427, 149 సెక్షన్ల కింద ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు 10 మందిపై కేసులు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. 

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. వైసీపీ నుంచి గంగుల తరపున గంగుల నాని బరిలో దిగారు. ఎన్నికల పోలింగ్‌లో అహోబిలంలో రణరంగం జరిగింది. టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. ఇరు పార్టీల నేతలు కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులో భూమా భర్త పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ వివాదంపై భూమా అఖిల ప్రియ ఎలా స్పందిస్తారో చూడాలి.