HomeTelugu politics

క‌ల‌క‌లం రేపుతున్న విడుదల రజనీ వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
Chilakalooripeta MLA Vidudala Rajani warns her opponents
Wednesday Oct 02, 2019
రాజకీయ నాయకులకు ఇతర పార్టీ నేతలతో విబేధాలు ఉండడం అందరికి తెలిసిందే. కొంతమందికైతే వారున్న పార్టీలోనే ఇత‌ర కీల‌క నేత‌లతో మనస్పర్ధలు ఏర్పడుతుంటాయి. ఇటువంటి పరిస్థితే ఇప్పుడు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడద‌ల ర‌జ‌నీకి ఎదురైంది. 

ఈ రోజు చిల‌క‌టూరిపేట కేంద్రంగా జ‌రిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో రజనీ మాట్లాడుతూ, "సొంత పార్టీ వైసీపీ కీల‌క నేత‌లే రాజ‌కీయంగా త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని విడుద‌ల ర‌జ‌నీ అన్నారు. త‌న వెంట ఉన్న‌వారే త‌న‌ను రాజ‌కీయంగా వెన్నుపోటు పొడ‌వాల‌ని చూస్తున్నారు. నా  పొలిటిక‌ల్ కెరీర్‌ను దెబ్బ తీయాల‌నుకున్న వారి అంతు చూస్తాను అంటూ హెచ్చ‌రించారు. 

మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేను.. గెలుపు ఆనందాన్ని ఆస్వాదించ‌లేక‌పోతున్నాను. చిల‌క‌టూరిపేటకు ప‌ట్టిన ద‌రిద్రాన్ని త‌రిమెయ్యాలని, పేట‌పై వాలిన అవినీతి గ‌ద్ద‌ల‌ను వ‌దిలించాల‌ని తాను వైసీపీలో చేరిన‌ట్టు విడద‌ల ర‌జ‌నీ అన్నారు.

విడద‌ల ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

   Politics

   Lifestyle