HomeTelugu politics

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం
Published By :  Lasya Raghavaraju Image Image
Former Chittoor MP Sivaprasad health condition turns critical
Friday Sep 20, 2019
చిత్తూరు మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నారమల్లి శివప్రసాద్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు  తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నశివప్రసాద్ ను కుటుంబ సభ్యులు గత వారం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 

అయితే ఆయన ఆరాగ్యం ఇవాళ శివప్రసాద్ ఈ రోజు మరింత క్షీణించిందని ఆయన బంధువులు తెలిపారట. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించనున్నారు.

శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసన తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.