HomeTelugu politics

పవన్ కళ్యాణ్ జనసేనకి ట్విట్టర్ షాక్, 400 ఖాతాలు సస్పెండ్
Published By :  Lasya Raghavaraju Image Image
Pawan Kalyan questions Twitter over 'suspension' of JSP Twitter accounts
Wednesday Sep 18, 2019
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో వీర విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు కూడా ట్విట్టర్ లో మద్దతు దార్లు, అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ జనసేన పార్టీకి చెందిన 400 ఖాతాలను బ్లాక్ చేసింది. 

జనసేన పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్యమైన ఖాతాలైన ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసి జనసైనికులకు షాక్ ఇచ్చింది. 

ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.. జనసేన మద్దతుదారులకు సంబంధించి 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని, నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి..అంటూ ట్విట్టర్ నిర్వహకులను పవన్  ప్రశ్నించారు. 

బ్లాక్ చేసిన తమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్.