HomeTelugu politics

తెలంగాణ 2019-20 బడ్జెట్ కేటాయింపులు
Published By :  Divya Valluru Image Image
Telangana 2019-20 budget at 1,46,492.30 crores; budget highlights
Monday Sep 09, 2019
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు అసెంబ్లీలో 2019-2020 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు. మూల ధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.67 కోట్లు. ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. 

ముందుగా వార్షిక బడ్జెట్ రూ.1.67 లక్షల కోట్ల నుంచి రూ.1.70 లక్షల కోట్ల మధ్య ఉంటుందని భావించారు. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ సైజు తగ్గించారు. బడ్జెట్ లో సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. బంగారు తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ ఆకాంక్షలకు పెద్ద పీట వేశారు. 

 బడ్జెట్ ప్రాధాన్యతాంశాలిలా ఉన్నాయి… 

* ఆరోగ్యశ్రీకి రూ. 1,336 కోట్లు
* కొత్త జోనల్ వ్యవస్ధ ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
* కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన
* గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ. 339 కోట్లు
*  గ్రామ పంచాయతీలకు బడ్జెట్‌లో 2,714 కోట్లు కేటాయింపు
* మున్సిపాలిటీలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు * పెన్షన్ వయో పరిమితి 65 ఏళ్ల నుంచి 57కి తగ్గింపు
*  బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ తొలగింపు
* ఆసరా పెన్షన్ల నిమిత్తం రూ. 9,402 కోట్లు కేటాయింపు * రైతు బంధు పథకం కింద సాయం రూ. 8,000 నుంచి రూ.10 వేలకు పెంపు ఇందుకోసం రూ. 12 వేల కోట్లు
* రైతు బీమా ప్రీమియం కోసం రూ.1,137 కోట్లు
* పంట రుణాల మాఫీల రూ. 6 వేల కోట్లు
* వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది
* విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు * గడచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
* వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది
* వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం
* వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 8.1 శాతం నమోదు
* ప్రభుత్వ ఆర్ధిక విధానాల ద్వారా మూలధన వ్యయం పెరిగింది.
* ఆర్ధిక మాంద్యం ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది
* గత ఆర్ధిక సంవత్సరంలో 5.8 శాతం వృద్ధి
* ఐటీ ఎగుమతుల విలువ రూ. 1,10,000 కోట్లు
* మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారం
* కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలతో మరింత పారదర్శక పాలన
* మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగుపడుతుంది
* ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తాం
* మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు
* 18 నెలలుగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతోంది
* రైతు బంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుంది
* కాళేశ్వరం సహా భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు కొనసాగింపు
* స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా చర్యలు
* కేంద్ర పథకాల అమలు కోసం అందిన నిధులు రూ. 31,802 కోట్లు మాత్రమే
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీసీ వృద్ధి రేటు 10.5 శాతం

   Politics

   Lifestyle