HomeTelugu politics

ఆంధ్ర ప్రజల మనోభావాలు జగన్‌ కు లెక్కలేదు : లోకేశ్
Published By :  Ravi Koneri Image Image
TDP MLC Nara Lokesh lashes out at Jagan over Amaravati
Monday Sep 09, 2019
ట్విట్టర్ వేదికగా ఏ పీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడున్నమాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్  మరోసారి ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోభావాలంటే జగన్‌గారికి ఎంత లెక్కలేనితనమోనని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలతో సొంత ఇళ్లను కట్టుకుని.. రాష్ట్ర ప్రజల కోసం అద్భుత రాజధాని అవసరంలేదు అనే ఆలోచన చేస్తున్నారన్నారు. 

”ఆంధ్రుల మనోభావాలంటే జగన్‌ గారికి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజుల్లో ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?” అని లోకేష్ ట్వీట్ చేశారు.

   Politics

   Lifestyle