HomeTelugu politics

ఆ వార్తలను నమ్మొద్దంటున్న రజినీకాంత్
Published By :  Lasya Raghavaraju Image Image
Superstar Rajinikanth not planning to join BJP
Saturday Sep 07, 2019
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా చేస్తున్నారు. నయనతార కథానయికగా నటిస్తున్న దర్బార్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ నెలాఖరు లోగా షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ లో ఆడియో వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న దర్బార్ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా రిలీజ్ కాబోతున్నది.  

ఇదిలా ఉంటే, దర్బార్ రిలీజ్ తరువాత రజినీకాంత్ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇదివరకే ప్రకటించినట్లుగా రజినీకాంత్ కొత్తపార్టీ పెట్టె యోచనలో లేరని, బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. రజినీకాంత్ ఈ మధ్యన మోడీ,అమిత్ షా లను కాశ్మీర్ అంశం మీద పొగిడారు. అప్పటినుంచి సూపర్ స్టార్ బీజేపీవైపు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  

అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి తేటతెల్లం అయ్యింది.  రజినీకాంత్ బీజేపీలో జాయిన్ అవుతారనే ఆలోచన కేవలం ఊగాహనాలు మాత్రమే అని, అందులో నిజం లేదని రజినీకాంత్ సన్నిహిత వర్గాలు ప్రకటించాయి. సూపర్ స్టార్ కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రజినీకాంత్ కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

   Politics

   Lifestyle