HomeTelugu news

భార్యాబిడ్డల కోసం చిరుతతో పోరాడి చంపేసిన రియల్ హీరో
Published By :  Divya Valluru Image Image
man kills leopard to save wife and daughter in Karnataka Hasan
Tuesday Feb 23, 2021
తన భార్యా పిల్లలను కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి చిరుతపులితో పోరాడిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఖాళీ చేతులతోనే చిరుతను మట్టి కరిపించి భార్య, కుమార్తెను కాపాడుకున్న ఈ వ్యక్తిని గురించి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. 

హసన్ జిల్లా హరిసెక్రె తాలూకా, బెండెకెరే ప్రాంతంలో భార్య కుమార్తెతో కలిసి రాజ్‌గోపాల్‌ నాయక్‌  అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ఆయన బైక్ బెండాక్రె ప్రాంతానికి చేరుకోగానే అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుతపులి ఒక్కసారిగా మీదకి దూకింది. దీంతో వారు ముగ్గురూ బైకు మీద నుంచి కిందపడిపోయారు. పులి భార్యా కూతురు మీదకు లంఘించే సరికి రాజగోపాల్ నాయక్ పులితో పోరాటం సాగించాడు. వీరోచితంగా పోరాడి పులిని చంపేసి భార్యా కూతురును కాపాడుకున్నాడు. ఈక్రమంలో రాజగోపాల్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్నసమయానికి అక్కడకు చేరుకున్న స్ధానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

   Politics

   Lifestyle