HomeTelugu news

లైసెన్స్‌ లేని అమ్మాయికి బైక్ ఇచ్చి జైలుపాలయ్యాడు
Published By :  Lasya Raghavaraju Image Image
Man arrested in hyderabad for giving scooty to his friend without licence
Tuesday Feb 23, 2021
డ్రైవింగ్ నేర్చుకుంటానని, అలా ఒక రౌండ్ తిరిగివస్తానని డ్రైవింగ్ తెలియని మీ స్నేహితులకో, బంధువులకో, పక్కింటి వారికో బండిని ఇచ్చే అలవాటున్న వారికి ఇదో హెచ్చరిక .  లైసెన్స్ లేని ఒక యువతికి వాహనం ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు అనే కారణంగా ఒక యువకుడిని జైలుకు పంపారు హైదరాబాద్  పోలీసులు. 

ఈనెల 20వ తేదీన అర్ధరాత్రి హైదర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీడీఎస్‌ విద్యార్థిని ఆది రేష్మ(20) మృతి చెందింది. ఈ ఘటనలో ఆమెకు వాహనం ఇచ్చిన అజయ్ సింగ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా బద్వేల్‌ మండలం శాస్ర్తీనగర్‌కు చెందిన మేదా చంద్రశేఖర్‌ కుమార్తె ఆది రేష్మ(20) కర్ణాటకలోని గుల్బర్గా‌లో బీడీఎస్ కోర్సు చదువుతోంది. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఈ నెల 20 స్నేహితులతో కలిసి మియాపూర్‌లోని జీఎస్ఎం మాల్‌‌లో సినిమా చూసేందుకు వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్‌సింగ్‌ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనకాల కూర్చుంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను స్కూటీ నడుపుతానని రేష్మ పట్టుబట్టింది. కొంతదూరం నడిపిన అనంతరం స్కూటీ అదుపు తప్పి ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

రేష్మకి డ్రైవింగ్ చేయడం రాదని తెలిసి కూడా రాత్రి సమయమే కదా ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఆమెకు బండి ఇచ్చిన అజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేసారు. పరోక్షంగా యాక్సిడెంట్‌ కు కారణం అయినందుకు గాను అజయ్ సింగ్‌ ను అరెస్ట్‌ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కోర్టు కూడా దీనిని తీవ్ర నిర్లక్ష్యంగా భావించి అతనికి రిమాండ్ విధించింది. 

యాక్సిడెంట్‌ కు కారణం అయిన లారీ డ్రైవర్‌ కృష్ణ ఇంకా పరారిలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

   Politics

   Lifestyle