దాద్రానగర్ హవేలీకి చెందిన ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం ముంబైలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. మోహన్‌కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. హోటల్ రూమ్‌లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ గుజరాతీలో రాసి ఉన్నట్టుగా తెలుస్తోంది.
దాద్రా, నగర్ హవేలి లోక్‌సభ సీటు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంపీ మోహన్ డెల్కర్ ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న హోటల్లో చనిపోయి కనిపించారు. ఈ సంఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మోహన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ప్రాధమికంగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
1989 లో మోహన్ డెల్కర్ దాద్రా నగర్ హవేలి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీగా మొదటిసారి ఎన్నికయ్యారు. తరువాత, భారత నవశక్తి పార్టీ తరపున మోహన్ డెల్కర్ ఎంపీ అయ్యారు, 2009 సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికలలో, 2019 ఎన్నికలలో మాత్రం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.