HomeTelugu news

రైతుల ఆందోళ‌న దేనికో వాళ్ల‌కే తెలియ‌దు అంటున్న ‌హేమ‌మాలిని
Published By :  Lasya Raghavaraju Image Image
BJP MP Hema Malini shocking comments on Farmers agitation
Wednesday Jan 13, 2021
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో చ‌లి, వాన‌కు కూడా బెద‌ర‌కుండా రైతులు  చేస్తోన్న ఆందోళ‌నలపై అల‌నాటి బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు ఎందుకు ఆందోళ‌న చేస్తున్నారో, వారు ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్ల‌కే తెలియ‌దని హేమ‌మాలిని అన్నారు. అస‌లు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల వ‌ల్ల  ఏ  స‌మ‌స్య ఉందో కూడా వాళ్ల‌కు తెలియ‌దంటూ ఆమె వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వారి ఆందోళ‌న స్వచ్ఛంద‌మైనది కాద‌ని దీన్ని బ‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని చెప్పారు. వారితో కొంద‌రు ఈ ఆందోళ‌న చేయిస్తున్నార‌ని హేమా మాలిని అభిప్రాయ‌ప‌డ్డారు. 

కాగా, హేమ‌మాలిని యూపీలోని మ‌థుర పార్ల‌మెంట్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

   Politics

   Lifestyle