HomeTelugu news

అత్యాచార ఆరోపణలు అబద్ధం ఆమెతో రిలేష‌న్‌లో ఉన్నా : మ‌ంత్రి ధ‌నంజ‌య్‌
Published By :  Divya Valluru Image Image
Maharashtra minister Dhanunjay refutes rape allegation terms it blackmail
Wednesday Jan 13, 2021
మ‌హారాష్ట్రకు చెందిన సామాజిక‌, న్యాయ‌శాఖ మంత్రి ధ‌నంజ‌య్ ముండే తన పై 14 ఏళ్లుగా అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసి సింగర్ రేణు శర్మ సంచలనం రేపింది. తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే ఈ ఆరోపణలపై త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేసిన మంత్రి ధ‌నంజ‌య్‌.. త‌న‌పై ఫిర్యాదు చేసిన 38 ఏళ్ల మ‌హిళ‌తో 2008 నుంచి రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు.  ఆమెను రేప్ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు.  మహిళతో ఉన్న రిలేషన్ షిప్ ను తన కుటుంబం కూడా అంగీకరించిందని, ఆమె ద్వారా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మంత్రి వివరించారు. అయితే ఆమెతో పాటు ఆమె సోద‌రి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని, డ‌బ్బులు రాబ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో తాను కూడా పోలీసు ఫిర్యాదు ఇచ్చిన‌ట్లు మంత్రి త‌న పోస్టులో పేర్కొన్నారు. 

‘‘2008లో తాను ఒంటరిగా ఇంట్లో ఉండగా మంత్రి ముండే నాపై మొదటిసారి అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. తీసిన అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి నాపై పలు సార్లు అత్యాచారం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోనని 2019లో ముండే చెప్పాడు’’ అని మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులు ఈ కేసును నమోదు చేయలేదు. దీంతో తాము కోర్టు ద్వారా ఫిర్యాదు చేస్తామని మహిళ తరపున న్యాయవాది రమేష్ త్రిపాఠి చెప్పారు. మంత్రి ముండే వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని,తనను పోలీసులు కాపాడాలని బాధిత మహిళ కోరింది. 

   Politics

   Lifestyle