ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిలను అబ్బాయిలు తమ ప్రేమను ఒప్పుకోలేదనో, పెళ్ళికి ఒప్పుకోలేదనో గొంతు కోసి లేదా రకరకాలుగా చంపేసిన ఘటనలు మనం చూసాం. చేయడం చూశాం. కాని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురు మండలం ధర్మవరం లో పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియుడిని ప్రేయసి దారుణంగా నడిరోడ్డు పైన చంపేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో స్థానికంగా ఉండే పావని మరియు తాతాజీ నాయుడు లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని మొదట అనుకున్నారు. కాని గత ఏడాది కాలంగా తాతాజీ నాయుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పావని ఎంత కోరినా కూడా పెళ్లి చేసుకోవడం తన వల్ల కాదు అంటూ చెబుతూ వచ్చిన తాతాజీ నాయుడును సోమవారం మద్యాహ్నం సమయంలో పంగిడిలో కలిసింది. ఆ చుట్టు పక్కల రాత్రి వరకు ఉన్న పావని మరియు తాతాజీ నాయుడు బండిపై మలకపల్లి వెళ్తున్నారు.
అక్కడ పావనిని దించి తాను వెళ్లి పోవాలని తాతాజీ భావించాడు. అయితే తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోని తాతాజీని బండిపై వెనుక కూర్చున్న పావని కత్తితో పొడిచింది. దాంతో కింద పడ్డ తాతాజీని పావని విచక్షణ రహితంగా పొడిచేసింది. దీంతో తాతాజీ తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. అటుగా వెళ్తున్న వారు విషయం గమనించి పోలీసులకు అప్పగించారు. తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేసినందుకే ఎంతో ఇష్టమైన తాతాజీని చంపేశాను అంటూ పావని చెప్పింది.
కేసు నమోదు చేసిన పోలీసులు పావనిని అదుపులోకి తీసుకున్నారు.