HomeTelugu news

విద్యార్థినిని లైంగికంగా వేధించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
Published By :  Divya Valluru Image Image
Former BJP MLA accused of sexually harassing girl student
Monday Jan 11, 2021
ఉతర్తప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పై ఓ విద్యార్థిని లైంగిక ఆరోపణలు చేసిన ఘటన తీవ్ర చర్చనీయంసం అవుతోంది.  బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకి దేహశుద్ది చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాలు.. వారణాసి భగతువా ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మాయ శంక‌ర్ ప‌ఠాక్‌కు ఎంపీ గ్రూపు పేరిట విద్యాసంస్థ‌లు ఉన్నాయి. అయితే త‌న విద్యాసంస్థ‌లో చ‌దువుతున్న తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను మాజీ ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఆదివారం రోజు మాయ శంక‌ర్ విద్యాసంస్థ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన త‌ల్లిదండ్రులు ఆయ‌న‌ను నిల‌దీశారు. ఇద్ద‌రు మ‌హిళ‌లు మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడి అనంతరం పాథక్.. విద్యార్థిని కి క్షమాపణ చెప్పారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాథక్ తనను లైంగికంగా వేధించాడని విద్యార్థిని పోలీసులకు తెలిపింది.

పాథక్‌పై విద్యార్థిని దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. మరోవైపు ఈ ఘటన తన ఇమేజ్‌ను కించపరచడానికి చేసిన రాజకీయ కుట్ర అని పాథక్ ఆరోపించారు. "వారం రోజుల కిందట బాలిక రిపబ్లిక్ డే స్పీచ్‌కు ప్రిపేరింగ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆమె స్పీచ్ సరిగా చదవకపోవడంతో నేను ఆమెను తిట్టాను. అనంతరం అక్కడ నుంచి పంపించాను. ఒక విద్యార్థినిని తిట్టడం నేరం అయితే.. నేను దీనికి క్షమాపణలు చెబుతున్నాను. వారు నాతో మాట్లాడుతున్న సమయంలో వీడియో తీస్తున్నట్టు నేను గుర్తించలేదు" అని పాథక్ తెలిపారు. 

ఇక, పాథక్ చిరాగావ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

   Politics

   Lifestyle