HomeTelugu news

హైటెన్షన్ వైర్‌కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
Published By :  Divya Valluru Image Image
young man commits suicide by hanging himself from a high tension wire
Monday Jan 11, 2021
జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది.  మల్యాల మండలం నూకపల్లి శివారులో 132 కేవీ హైటెన్షన్‌ విద్యుత్ టవర్ ఎక్కి ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం కొంతభాగం కాలిపోగా మృతదేహం టవర్‌పై వేలాడుతోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

యువకుడి మృతదేహాన్ని కిందకు దించేందుకు ట్రాన్స్‌కో ఎల్‌సీ తీసుకుని సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది.  హైటెన్షన్‌ లైన్‌ కావటంతో సరఫరా నిలిపివేస్తే పలు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కాగా, అంత ఎత్తైన టవర్‌పైకి ఎక్కి విద్యుత్తు సరఫరా అవుతుండగా యువకుడు ఉరి ఎలా వేసుకున్నాడనేది అంతు చిక్కకుండా తయారైంది. 

హై ఓల్టేజ్‌తో పవర్ సప్లై అవుతున్న వైర్ల వద్దకు వెళ్లే సాహసం చేయడమే మిస్టరీగా మారింది. యువకుడు గత అర్థరాత్రి టవర్ ఎక్కి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

   Politics

   Lifestyle