HomeTelugu news

సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ కారుకు యాక్సిడెంట్‌
Published By :  Divya Valluru Image Image
Sania Mirza husband Shoaib Malik met with Car accident
Monday Jan 11, 2021
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారు లాహోర్‌లో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి మాలిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మాలిక్ పాకిస్తాన్ సూపర్ లీగ్ సమావేశంలో పాల్గొని బయటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

ఆదివారం రాత్రి తన సహచర క్రికెటర్ వాహబ్ రియాజ్ కారుని ఓవర్‌టేక్ చేసేందుకు షోయబ్ మాలిక్ ప్రయత్నించగా అదుపు తప్పిన స్పోర్ట్స్ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ట్రక్‌ని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోగా షోయబ్ మాలిక్‌కి ఎలాంటి గాయాలు కాలేదు.  లగ్జరీ స్పోర్ట్స్ కారు కావడంతో షోయబ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

యాక్సిడెంట్ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వెల్లడించిన మాలిక్.. తాను క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. వన్డే, టెస్టులకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్.. టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు.

   Politics

   Lifestyle