HomeTelugu news

విడాకులకు సిద్దమవుతున్న సివిల్స్‌ టాపర్స్‌ ప్రేమజంట
Published By :  Lasya Raghavaraju Image Image
IAS Toppers Tina Dabi and Athar Khan heads for splitsville
Saturday Nov 21, 2020
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట అథర్‌ ఆమిర్‌ ఉల్‌ షఫీఖాన్‌, టీనా దాబీ తమ దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.  వివాహమైన రెండేళ్లకే వీరు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

రాజస్థాన్ కు చెందిన ఈ ఐఏఎస్ జంట ఆధర్ అమిర్ ఉల్ షఫీఖాన్, టీనా దాబి లు ఇరువురు 2015 లో సివిల్స్ టాపర్స్ గా నిలిచారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ వీరిద్దరూ పోస్టింగ్ ల తరువాత పెళ్లి చేసు కుంటున్నట్లు ప్రకటించారు. హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోవద్దని విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం తెలిపినా లెక్కచేయకుండా ఒక్కటయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఈ జంట ఇప్పుడు తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది. 

పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి. చదవుకున్న యువతీ, యువకులు కావడంతో అర్థంచేసుకుని సర్ధుకుపోతారని ఇరువురి కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కానీ వారిద్దరి మధ్య రోజు రోజుకు గొడవలు ముదరి విడాకుల వరకు వచ్చింది.. దీంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.  అమీర్ జైపూర్‌లోని ప్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.  

అయితే కులాలు, మతాలను కాదని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయకుండా వివాహ బంధంతో ఒకటైన జంట తాజాగా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

   Politics

   Lifestyle