HomeTelugu news

గుజరాత్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు సజీవదహనం
Published By :  Lasya Raghavaraju Image Image
Seven people burnt alive in Car and Truck collision in Gujarat
Saturday Nov 21, 2020
గుజరాత్‌ సురేంద్రనగర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  వేగంగా వస్తున్నా డంపర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవదహనమైయ్యారు. 

కారులోని వారు చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.  ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబాలకు వాటిని అప్పగించనున్నారు. 

ప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

   Politics

   Lifestyle