HomeTelugu news

పాకిస్తాన్‌లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి విష్ణుమూర్తి ఆలయం
Published By :  Divya Valluru Image Image
Over 1300 years old Vishnu temple discovered in northwest Pakistan
Saturday Nov 21, 2020
దాయాది దేశం పాకిస్తాన్‌లో అత్యంత పురాతన హిందూ ఆలయం బయటపడింది. 1300 ఏళ్ల కిందట నిర్మించిన విష్ణువు ఆలయాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు  గుర్తించారు. స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటలీ, పాకిస్థాన్ దేశాలకు చెందిన పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. 

క్రీస్తుశకం 7వ శతాబ్దాల్లో దీన్ని నిర్మించి ఉంటారని  పాక్ పురావస్తుశాఖ అధిపతి ఫజల్ ఖాలిక్ వెల్లడించారు. గుడి ప్రాంతంలో కోట బురుజులు, మండపాలు, పుష్కరిణి కూడా కనిపించాయి.  స్వాత్ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహి ఏలుబడితో ఈ ఆలయాన్ని నిర్మించారని ఆయన వెల్లడించారు. 

చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 850-1026 మధ్య కాలంలో షాహి పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారు. వీరు వాయవ్య భారత ప్రాంతాన్ని పాలించినట్టు కూడా చరిత్రలో ఉంది. ఈ రాజ్యవంశీకులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెపుతున్నారు. స్వాత్ లోయలో ఒకప్పుడు బౌద్ధమతం వర్ధిల్లింది. తర్వాత ముస్లిం పాలకుల హయంలో అస్థితర నెలకొంది. తాలిబాన్ ఉగ్రవాదులు అక్కడి బౌద్ధారామాలను, విగ్రహాలను నేలమట్టం చేశారు. 

   Politics

   Lifestyle