HomeTelugu news

క్రికెట్ బెట్టింగ్ కేసులో కామారెడ్డి సీఐ జగదీష్‌ చేతివాటం
Published By :  Divya Valluru Image Image
kamareddy circle inspector Jagadeesh bribed 5 lakhs to grant station bail
Saturday Nov 21, 2020
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసినందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జగదీశ్ ఆఫీసుతో పాటు ఇంట్లో  సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సీఐ జగదీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

కామారెడ్డికి చెందిన బత్తుల సుధాకర్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఈ నెల 8న అరెస్ట్ అయ్యారు. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.  మొదటి వాయిదాగా లక్షా 39 వేల 500 రూపాయలు తీసుకొని అరెస్ట్ చేసిన 8వ తేదీనే జగదీశ్ ను విడుదల చేశారు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్‌ ఒత్తిడి  పెంచ డంతో అతను  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో నిన్న నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్‌ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్‌ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ గురించి సీఐ జగదీష్‌కు ఓ మొబైల్ షాప్‌లో పని చేస్తున్న సృజయ్ అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడని తెలుసుకున్న అధికారులు వారిద్దరినీ ఒకేచోట విచారించారు. విచారణలో కీలక సమాచారం సేకరించిన ఏసీబీ సీఐ జగదీష్, సృజయ్ లను అరెస్ట్ చేశారు. 

   Politics

   Lifestyle