HomeTelugu news

సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఆర్డర్‌ చేస్తే సోన్‌పాపిడి డబ్బా వచ్చింది
Published By :  Divya Valluru Image Image
Karnataka man cheated by online fraudsters with Som Papdi
Saturday Nov 21, 2020
ఆన్లైన్ ద్వారా ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కారుచవగ్గా పొందుదామని ఆశపడ్డ ఓ ఆశావాదికి ఆన్‌లైన్‌ వంచకులు జలక్ ఇచ్చారు. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ఇదేమాదిరి నష్టపోయాడు.
 
గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి దీపావళి పండుగ సందర్భంగా సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే కేవలం 1700 రూపాయలకే అందిస్తున్నామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అంత తక్కువ ధరకే సాంసంగ్ గెలాక్సీ ఫోన్ వస్తుండడంతో ఎంతో మురిసిపోయి నరసింహమూర్తి ఆ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఆర్డర్ చేశాడు. అయితే పోస్టల్ నుంచి ఒక పార్సిల్ వస్తుందని డబ్బులు చెల్లించి ఆ పార్సెల్ తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి నరసింహ మూర్తి కి తెలియజేశాడు.

చెప్పినట్లుగానే పోస్టల్ శాఖ నుంచి ఒక పార్సిల్ రావడంతో నరసింహమూర్తి 1700 రూపాయలను చెల్లించి ఆ పార్సిల్ ను అందుకున్నాడు. ఎంతో ఆతృతగా తన ఫోన్ కోసం పార్సెల్ ఓపెన్ చేయగా అతనికి దిమ్మతిరిగింది. 1700రూపాయల స్మార్ట్ ఫోన్ కి బదులుగా 50 రూపాయల సోన్ పాపిడి డబ్బా, ఒక రోల్డ్ గోల్డ్ చైన్ అందులో ఉండడం చూసి నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు. వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

   Politics

   Lifestyle