HomeTelugu news

పోప్‌ ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి బికినీ మోడల్ ఫోటోకి లైక్
Published By :  Divya Valluru Image Image
Pope Francis Instagram account like for bikini model photo sparks anger
Friday Nov 20, 2020
వాటిక‌న్ సిటీలో ఉండే పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడ‌ల్ బికినీలో ఉన్న ఫొటోను పొప్ ఇన్‌స్టాగ్రాం అధికారిక నుంచి లైక్ వెళ్ళింది. ఇప్పుడు ఇది కాస్తా పొప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది.

అసలు విషయమేంటంటే .. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతలా అంటే.. 1.5 మిలియన్లకి పైగా లైక్స్ దీనికి వచ్చాయి. అయితే ఈ లైక్స్ లో పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి కూడా ఈనెల 13న లైక్ వచ్చింది. అయితే విష‌యం అంద‌రికీ తెలిసి వైర‌ల్ కాగానే మ‌రుస‌టి రోజు ఆ ఫొటోను అన్‌లైక్ చేశారు. 

ఈ లైక్ స్క్రీన్ షాట్ ను నటాలియా మానేజ్‌మెంట్‌ కంపెనీ సీఓవై.కో తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ లైక్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. 'సీఓవై.కోకి పోప్‌ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్‌ క్వీన్‌ నటాలియాకు ధన్యవాదాలు' అంటూ స్క్రీన్‌ షాట్‌ని షేర్‌ చేసింది. అదే ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది. 

అయితే పోన్ ఇన్‌స్టా ఖాతా నుంచి ఆ ఫొటోకు లైక్ రావ‌డంపై వాటిక‌న్ సీరియ‌స్ అయింది.  సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని హోలీ సీ ప్రకటించింది.  పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్‌లని ఈయన ఫాలో కారు.

   Politics

   Lifestyle