HomeTelugu news

ఏప్రిల్‌కి వచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గుడ్ న్యూస్ చెప్పిన సిరమ్ సంస్థ
Published By :  Lasya Raghavaraju Image Image
Covid Vaccine should be available for public by April 2021 says Serum Institute
Friday Nov 20, 2020
కరోనా వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పలు వాక్సిన్‌లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్‌లు రేస్‌లో ముందున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. 

భారత్‌లో 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బంది, వృద్ధులకు ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.  ఈ వాక్సిన్ ధర రూ. వెయ్యిలోపే ఉంటుందని స్పష్టం చేశారు. వెయ్యి రూపాయలకే రెండు వాక్సిన్ డోస్‌లు అందజేస్తామని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం అందుబాటులోకి తీసుకొస్తామని, సామాన్య ప్రజలకు ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. 

"బహుశా మరో రెండు మూడేళ్లలో భారతీయులందరికీ టీకా వేయడం పూర్తవుతుంది. ఎందుకంటే వందల కోట్ల మంది భారతీయులకు వాక్సిన్ సరఫరా చేయాలంటే బడ్జెట్, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. 2024లోపు అందరూ టీకా వేసుకుంటారని అనుకుంటున్నాం. ఆక్స్‌ఫర్డ్ టీకా ధర మన దేశంలో రెండు డోస్‌లకు రూ.వెయ్యి ఉంటుంది. తక్కువ ధరకే టీకాలను తీసుకురావాలని భారత్ ప్రభుత్వం యోచిస్తోంది. కొవాక్స్ ధరకు సమానంగా ఆక్స్‌ఫర్డ్ ధర ఉంటుంది. అవసరమైతే ఇంకా కాస్త తక్కువే ఉంటుంది.'' అని పూనావాలా తెలిపారు.

ఇప్పటికే నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. 

   Politics

   Lifestyle