HomeTelugu news

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది మృతి
Published By :  Ravi Koneri Image Image
Atleast 14 dead including six after Bolero collides with Lorry in UP
Friday Nov 20, 2020
ఉత్తరప్రదేశ్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీ ప్రయాగ్‌రాజ్ మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని ప్రతాప్‌గడ్‌లో ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారి పై లారీ, బొలెరో వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. 

ప్రయాగ్‌రాజ్‌ వైపు వేగంగా వెళుతున్న బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. భారీ శబ్దంతో స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడకి చేరుకొని అతి కష్టం మీద మృతదేహాలను బయటకి తీసారు. 

ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లి బాధితులకు సాయం చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. 

   Politics

   Lifestyle