HomeTelugu news

డీఎంకే మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం విషమంగా పరిస్థితి
Published By :  Ravi Koneri Image Image
DMK MLA Aladi Arunaa Poongodai attempts Suicide condition serious
Friday Nov 20, 2020
తమిళనాడులో డీఎంకే శాసనసభ్యురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలంగా మారింది. తిరునల్వేలి జిల్లా ఆలంకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలడి అరుణా పూంగోదై ఆత్మహత్యాయత్నం చేసి తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్టీ అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

అరుణా పూంగోదై ఇటీవల కడయంలో జరిగిన డీఎంకే సమావేశంలో తెన్‌కాశి జిల్లా డీఎంకే శాఖ కార్యదర్శి శివ పద్మనాభన్‌తో ఆమె గొడవ పడ్డారని, దీంతో ఆమె విరక్తి చెంది నిద్రమాత్రలు వేసుకున్నట్టు తెలిసింది. కడయం సభలో ఆలడి అరుణా పూంగోదైకి, తెన్‌కాశి డీఎంకే జిల్లా కార్యదర్శి శివపద్మనాభన్‌కు మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమేనని ఆలకుళం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే ఆ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారా లేదో ఖచ్చితంగా తెలియడం లేదని. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన వెల్లడించారు.  

అరుణా పూంగోదై ఎంపీ కనిమొళి వర్గానికి చెందినవారు కాగా, తెన్‌కాశి డీఎంకే జిల్లా శాఖ కార్యదర్శి శివపద్మనాభన్‌ ఎంకే స్టాలిన్‌కు మద్దతుదారుడు. కడయంలో జరిగిన డీఎంకే సభలో ఆలడి అరుణా పూంగోదైని శివపద్మనాభన్‌ అనుచరుడు శివన్‌ పాండియన్‌ అసభ్యపదజాలంతో దూషించారని కూడా చెబుతున్నారు. 

   Politics

   Lifestyle