HomeTelugu news

యూపీలో ఫిరోజాబాద్ బీజేపీ ఉపాధ్య‌క్షుడి కాల్చివేత
Published By :  Lasya Raghavaraju Image Image
Firozabad BJP leader shot dead by unidentified assailants
Saturday Oct 17, 2020
ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్య‌క్షుడిని దుండ‌గులు కాల్చిచంపారు. ఫిరోజాబాద్‌లో నిన్న రాత్రి బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు ఆయ‌న‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆయన అక్కడికక్కడే మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న తీవ్ర సంచలనంగా మారింది. 

ఫిరోజాబాద్ బీజేపీ ఉపాధ్య‌క్షుడు డీకే గుప్తా స్థానికంగా ఓ కిరాణా దుకాణం న‌డుపుతున్నారు. శుక్ర‌వారం రాత్రి త‌న‌ దుకాణాన్ని మూసివేస్తుండ‌గా కొంద‌రు ఆగంత‌కులు ఆయ‌న‌పై సమీపం నుంచి కాల్పులు జ‌రిపి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు ఆగ్రాలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే గుప్తా అప్ప‌టికే మరణించాడని డాక్టర్లు చెప్పారు. 

తన సహచరుడైన వీరేంద్ర తోమర్ కి, గుప్తాకు ఇటీవల తీవ్ర వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది. బీజేపీలో వీరేంద్ర తోమర్ చేరికను గుప్తా వ్యతిరేకించాడని, దాంతో వీరేంద్ర.. తన బంధువులైన నరేంద్ర, దేవేంద్ర తోమర్లను ఇతనిపై హత్యా యత్నానికి ప్రేరేపించాడని తెలుస్తోంది. 

గుప్తా కుటుంబ స‌భ్యులు కొంద‌రిపై అనుమానం వ్య‌క్తంచేశార‌ని, వారి పేర్లు న‌మోదుచేసుకున్నామ‌ని ఫిరోజాబాద్‌ సీనియ‌ర్ ఎస్పీ స‌చింద్ర ప‌టేల్ తెలిపారు. ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెళ్ల‌డించారు. 

   Politics

   Lifestyle