HomeTelugu news

అమెజాన్- ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులతో షాకిచ్చిన కేంద్రం
Published By :  Lasya Raghavaraju Image Image
Centre issues notices to Amazon and Flipkart over country origion
Saturday Oct 17, 2020
భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువులను ఈ కామర్స్ సంస్థల నుంచి తెప్పించుకుంటున్నారు. దీంతో పండగ సీజన్, వికెండ్ వచ్చిందంటే చాలు ఈ కామర్స్ సంస్థలు కూడా వారిని ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటీ పడి వస్తువులపై డిస్కౌంట్లు ఇస్తూ అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. 

ఈ కామర్స్ సంస్థలు అమ్ముకునే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయనే సమాచారం పొందుపరచక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు నోటీసులు జారీ చేసింది. కచ్చితంగా వాటి మూలాలను వినియోగదారుడికి తెలిసేలా పొందుపరచాలని సూచింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం కూడా ఇచ్చింది. ఈ నిబంధనలను ప్రతి ఈ కామర్స్ సంస్థ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. 

మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య స్వాగతించింది. వస్తువు ఎక్కడ తయారైందనే ట్యాగ్ లేకుండా వాటిని విక్రయిస్తున్న ఈ కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

   Politics

   Lifestyle