HomeTelugu news

యూపీలో బస్సు-ఎస్‌యూవీ ఢీ ఏడుగురు అక్కడికక్కడే మృతి
Published By :  Divya Valluru Image Image
Seven dead after Bus and SUV collided in UP Philibit
Saturday Oct 17, 2020
ఉత్తర ప్రదేశ్‌లో శనివారం(అక్టోబర్ 17) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిలిబిత్ జిల్లాలోని పురాన్‌పూర్ సమీపంలో ఓ బస్సు-ఎస్‌యూవీ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 32 మంది గాయాలపాలయ్యారు.

ఈ రోజు తెల్లవారుజామున 3గం.-4గం. మధ్యలో ప్రమాదం జరిగినట్లు ఫిలిబిత్ ఎస్పీ తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది ఫిలిబిత్‌కి చెందినవారేనని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా… బొలెరో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.

రెండు రోజుల క్రితం కబ్రాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ, ఆమె ఏడాది కుమారుడు మృతి చెందారు. కొడుకును ఎత్తుకుని ఆమె రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో ఓ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. ఇదే ఏడాది మే నెలలో ముజఫర్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందారు.

   Politics

   Lifestyle