HomeTelugu news

దేశంలో గత 24 గంటల్లో 62,212 మందికి కరోనా నిర్ధారణ
Published By :  Divya Valluru Image Image
New 62,212 corona cases registered in India in last 24 hours
Saturday Oct 17, 2020
భారత్ లో కరోనా వైరస్ కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి.  మధ్యలో కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 62,212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,32,681 కి చేరింది.

గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 837 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,998 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,24,596 మంది కోలుకున్నారు. 7,95,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,32,54,017 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,99,090 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

   Politics

   Lifestyle