HomeTelugu news

తెలంగాణ మాజీ మంత్రి నాయిని ఆరోగ్యం విషమం వెంటిలేటర్ పై చికిత్స
Published By :  Divya Valluru Image Image
Telangana Ex Home Minister Naini Narasimha Reddy Health Condition critical
Friday Oct 16, 2020
తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, తెరాస సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య  పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నాయిని హైదరాబాద్ లోని ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయనకు అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

గత నెల 28న కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారనుకునే సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినట్టు తెలిసింది. దీంతో ఆయనకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు న్యుమోనియా ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. దీంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో వెంటనే ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో నాయిని పాల్గొన్నట్టు తెలిసింది. అక్కడే అభిమానులతో కాసేపు గడిపారట.. అక్కడే కరోనాకు గురయ్యారని ప్రచారం సాగుతోంది.  

కాగా నాయిని భార్య అహల్య అల్లుడు విశ్రీనివాసరెడ్డి పెద్ద కుమారుడి మనువడికి కూడా కరోనా సోకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలిసింది.

   Politics

   Lifestyle