HomeTelugu news

కేకేఆర్ కెప్టెన్సీ వదులుకున్న దినేష్ కార్తీక్ కొత్త కెప్టన్ మోర్గాన్‌
Published By :  Divya Valluru Image Image
Dinesh Karthik steps down as KKR captain Morgan to lead team
Friday Oct 16, 2020
దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2020)లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనున్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేష్ కార్తీక్ త‌ప్పుకున్నాడు. నేటీ నుంచి ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.  

బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో సార‌థ్యాన్ని వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు దినేశ్ వెల్ల‌డించాడు. ఇయాన్ మోర్గాన్‌తో చర్చించిన తర్వాత తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కార్తీక్ తెలిపాడు. కేకేఆర్ జట్టుకు 37 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించిన కార్తీక్ కెప్టెన్సీ మార్క్ మాత్రం చూపించలేకపోయాడు. అయితే కెప్టెన్సీ తనకు భారంగా మారిందని, తాను కేవలం బ్యాటింగ్ బారం మేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు కార్తీక్ వివరించాడు ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్‌కు కేకేఆర్ కెప్టెన్సీ అప్పగించినట్లు సమాచారం. దినేశ్ కార్తీక్ లాంటి ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉండ‌డం మంచిద‌ని, చాలా సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సీఈవో వెంకీ మైసూర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లాడిన కేకేఆర్ 4 మ్యాచ్‌లలో నెగ్గి, 3 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2020 సరిగ్గా సగం మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఐపీఎల్‌లో ప్రస్తుతం మూడు జట్లకు విదేశీ కెప్టెన్లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

   Politics

   Lifestyle