HomeTelugu news

మైనర్ బాలికను భందించి 22 రోజుల పాటు అత్యాచారం
Published By :  Divya Valluru Image Image
Fifteen years girl abducted and raped for 22 days in Odisha poultry farm
Friday Oct 16, 2020
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న కామాంధులు భయపడడంలేదు. రోజు ఎక్కడో ఒక చోట ఆడవారిని బలాత్కారిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా  పదిహేనేళ్ళ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఏకంగా 22 రోజుల పాటు అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసిన దారుణ ఉదంతం ఒడిశాలోకి కటక్‌లో జరిగింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఆనుకుని వున్న కటక్‌లోని చౌలియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.... ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయిన 15 ఏళ్ళ బాలికను ఇంటికి చేరుస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కటక్ శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో నిర్బంధించారు. 22 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురి చేశారని బాలిక పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. పౌల్ట్రీ ఫామ్‌లో బాలికపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించారు. నిందితులు సంతోశ్ బెహరా, రాకేశ్ రవుత్‌లపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 

మైనర్ బాలికపై రేప్ విషయం స్థానికంగా కలకలం రేపడంతో భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సుధాంశు సారంగి స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

   Politics

   Lifestyle