HomeTelugu news

బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ కన్నుమూత
Published By :  Divya Valluru Image Image
Bill Gates Father William Gates passed away at 94
Wednesday Sep 16, 2020
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం నెలకొంది. బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని… ఈ నేపథ్యంలో జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని తెలిపారు. కుటుంబసభ్యుల మధ్యే విలియమ్ గేట్స్ తుదిశ్వాస విడిచారని చెప్పారు. తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకున్న మేధస్సు, ఉదారత, గొప్ప భావాలతో తన తండ్రి ఎందరినో ప్రభావితం చేశారని బిల్ గేట్స్ చెప్పారు. తనపై కూడా ఆయన ప్రభావం ఎంతో ఉందని అన్నారు. అసలైన బిల్ గేట్స్ తన తండ్రేనని అన్నారు. 

విలియం గేట్స్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.

   Politics

   Lifestyle