HomeTelugu news

ఇండియాలో 50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు
Published By :  Lasya Raghavaraju Image Image
Corona positive cases in India crosses 50 lakhs with 90,123 new cases
Wednesday Sep 16, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో వైర‌స్ కేసుల సంఖ్య 50 ల‌క్ష‌ల మైలురాయిని దాటేసింది. 

గడిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది.  దీంట్లో యాక్టివ్ కేసులు 9,95,933 ఉన్నాయి. 39,42,361 మంది వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి కోలుకున్నారు.  

భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 19.84 శాతంగా ఉందని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 5,94,29,115 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొంది.

   Politics

   Lifestyle