HomeTelugu news

ఒంగోలులో రౌడీషీటర్‌ వీరంగం 108 అంబులెన్స్‌ను తగులబెట్టాడు
Published By :  Lasya Raghavaraju Image Image
Rowdy sheeter set ablaze ambulance in front of Ongole police station
Wednesday Sep 16, 2020
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఒంగోలు పోలీస్ స్టేషన్ సమీపంలో 108 అంబులెన్స్ కు రౌడీషీటర్ సురేష్ నిప్పుపెట్టాడు.  బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. 

వివరాల్లోకి వెళ్తే...స్థానికంగా ఉండే రౌడీషీటర్ సురేష్ ఇటీవల పదేపదే డయల్ 100కి రాంగ్ కాల్స్ చేశాడు. దీంతో 108 సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు.  విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడ నానా హంగామా చేసాడు సురేష్. పోలీస్ స్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టాడు. వింత వింతగా ప్రవర్తించడంతో.. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు. సురేష్ చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పించారు.

అనంతరం 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి.. అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు. దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించారు. ఐనా బయటకు రాకండా విచిత్రంగా ప్రవర్తించడంతో.. చాకచక్యంగా అతడిని బయటకు లాగేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే అంబులెన్స్ చాలా వరకు కాలిపోయింది. 

ఘటనలో గాయపడిన సురేష్‌ను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

   Politics

   Lifestyle