HomeTelugu news

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుకు కరోనా
Published By :  Lasya Raghavaraju Image Image
Arunachal Pradesh CM Pema Khandu tested positive for Corona virus
Wednesday Sep 16, 2020
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా ఈ వైరస్ కనికరించడం లేదు.  ఇప్పటికే మధ్య ప్రదేశ్, గోవా ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

తాను కరోనా పరీక్ష ఆర్టీ పీసీఆర్ చేయించుకోగా మంగళవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. కరోనా మార్గదర్శకాల మేరకు తాను హోం ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు పెమా ఖండు ట్వీట్ చేశారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1756 ఉండగా.. 4531 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 11 కరోనా మరణాలు సంభవించాయి.

   Politics

   Lifestyle