HomeTelugu news

ఐపీఎల్ 2020లో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్
Published By :  Lasya Raghavaraju Image Image
Arjun Tendulkar set to play for Mumbai Indians in IPL 2020
Tuesday Sep 15, 2020
యూఏఈ వేదిక‌గా మరో నాలుగు రోజులలో ప్రారంభం కానున్న జ‌రుగనున్న‌ ఐపీఎల్ 2020లో సచిన్ టెండూల్కర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడనున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు నెట్‌ బౌలర్లలో ఒకడిగా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ వ్యవహరిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం అర్జున్‌ అబుదాబిలో ముంబై జట్టు వెంట ఉన్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో సేదదీరుతున్న ఫొటోను ట్రెంట్ బౌల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.  ఫొటోలో ముంబై ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, ఇతర ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో అర్జున్ సేద తీరుతున్నాడు. అందులో అందరూ విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు. ఫొటోలో ఉన్న అందరూ బౌలేర్లే కావడం విశేషం. ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. 

టోర్నీలో ఏ క్రికెటరైనా గాయపడితే..? అతని స్థానంలో మరొక ఆటగాడ్ని తీసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పిస్తోంది. కానీ.. అతను వేలంలోకి వచ్చి ఉండాలనేది గత ఏడాది వరకూ ఒక రూల్‌గా ఉండేది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వేలంలోకి రాకపోయినా సదరు ఆటగాడు యూఏఈలో ఉండి బయో- సెక్యూర్ బబుల్ పరిధిలో ఉంటే తీసుకోవచ్చని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో.. ముంబయి ఇండియన్స్ టీమ్‌లోకి అర్జున్ టెండూల్కర్ వచ్చే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

   Politics

   Lifestyle