HomeTelugu news

మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేను కబళించిన కరోనా రక్కసి
Published By :  Lasya Raghavaraju Image Image
MadhyaPradesh Congress MLA Govardhan Daangi dies of Corona
Tuesday Sep 15, 2020
దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. ఈ మందులేని మహమ్మారి బారినపడి సామాన్యులతో పాటి ఎందరో ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా మధ్యప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే ఒకరు కరోనాతో మృతిచెందారు. 

రాజ్‌ఘర్ జిల్లాలోని బియోరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్దన్ డాంగీ కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు ఆగష్టు 25న కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన భోపాల్‌లోని చిరాయు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న డాంగీ.. మంగళవారం ఉదయం చనిపోయారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్వీట్ చేసింది.

ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పది మంది మంత్రులు, 28 మంది ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు. గోవర్దన్ మృతితో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 28 స్థానాలు ఖాళీ అయ్యాయి. గోవర్ధన్‌ మృతితో మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల ఖాళీల సంఖ్య 28కి చేరింది. అలాగే కాంగ్రెస్‌ సభ్యుల బలం 88కి పడిపోయింది.

   Politics

   Lifestyle