HomeTelugu news

వనపర్తి జిల్లాలో అనుమానాస్పద రీతిలో కుటుంబం మృతి
Published By :  Lasya Raghavaraju Image Image
Four family members die under suspicious circumstances in wanaparthy
Friday Aug 14, 2020
వనపర్తి జిల్లాలో రేవల్లి మండలం నాగపూర్‌లో ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానస్పద స్థితిలో చనిపోయారు. చనిపోయిన వారి మృతదేహాలు వేర్వేరు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడి ఉండడం, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. 

నాగపూర్ లో నివాసం ఉండే అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) ఊహించని రీతిలో చనిపోయారు. ఇంట్లో వీరంతా వేర్వేరు చోట్ల పడిపోయారు. హాల్‌, డైనింగ్ హాల్, వంటగది, ఇంటి వెనకలా ఇలా అంతా వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయి ఉన్నారు. నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అగర బత్తీలు ఉండటంతో పాటు ఇంటి ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి ఉండటం చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇది ఆత్మహత్యా, హత్యా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. 

దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. క్షుద్రపూజలే  కారణమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

   Politics

   Lifestyle