HomeTelugu news

గడిచిన 24 గంటల్లో దేశంలో 1007 కరోనా మరణాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Atleast 1007 died due to Corona virus in India in last 24 hours
Friday Aug 14, 2020
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ దేశంలో కొత్తగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 64,553 కరోనా కేసులు నమోదవగా,  1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 24,61,191కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 48,040 కి పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595. భారత్‌లో ఇప్పటివరకూ 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 55,573 మంది డిశ్చార్జి అయ్యారు. 8,48,728 శాంపిళ్లను పరీక్షించారు.  కాగా, నిన్నటి వరకు మొత్తం 2,76,94,416 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,91,079కు చేరింది. వీరిలో 64,19,775 యాక్టివ్ కేసులు ఉండగా, 1,39,17,825 మంది  కోలుకున్నారు.                                             

   Politics

   Lifestyle