HomeTelugu news

రష్యా కరోనా టీకాపై డబ్ల్యూహెచ్ఓ అధికారి కీలక వ్యాఖ్య
Published By :  Lasya Raghavaraju Image Image
WHO Senior officer interesting comments on Russia Corona Vaccine
Friday Aug 14, 2020
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు టీకా కోసం అన్ని దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాలు కరోనా టీకాను తయారు చేసామని త్వరలోను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలో రష్యా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని రష్యా ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా టికాతో ముందుకు వచ్చింది.  దీంతో కరోనా టీకాను విడుదల చేసిన తొలి దేశంగా రికార్డులకు ఎక్కింది. 

అయితే రష్యా కరోనా టీకా పని తీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ సలహాదారుడు డాక్టర్ బ్రూస్ అయాల్వార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. స్పుత్రిక్-వీ ఏ దశలో ఉందో తమకు వివరాలను ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.

 ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ వీ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు. దీంతో రష్యా ఇంత వరకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదనేది ఆసక్తిగా మారింది. 

   Politics

   Lifestyle