HomeTelugu news

టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ కు సోకిన కోరోనా
Published By :  Lasya Raghavaraju Image Image
Indian Cricketer Karun Naayar recovers fully from Corona
Thursday Aug 13, 2020
కంటికి కనిపించని కరోనా మహమ్మారి ఎ ఒక్కర్నీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, పరిపాలన అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అందరినీ ఇది భయపెడుతోంది. తాజాగా టీమిండియా క్రికెటర్, కింగ్స్ లెవెన్ పంజాబ్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్‌ కరోనా బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కర్నాటకకి చెందినా కరుణ్ నాయర్ రెండు వారాల క్రితం కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరుణ్‌కు వైరస్ సోకిన విషయాన్ని రెండు వారాల పాటు కరుణ్ నాయర్‌తో పాటు కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ (కేఏసీ) కూడా గోప్యంగా ఉంచాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్‌ నాయర్‌ సెల్ఫ్‌ హెమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉన్న నాయర్‌కు నాలుగు రోజుల క్రితం జరిపిన కోవిడ్‌-19 పరీక్షల్లో కోలుకున్నట్లు సమాచారం.

భారత్ తరఫున ఆరు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కరుణ్‌ నాయర్‌ కింగ్స్‌ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జరుగనున్న ఐపీఎల్‌ జరగడానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ రాగా, ఈ నెల 20వ తేదీ తర్వాత అన్ని ఫ్రాంచైజీలు యూఏఈకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నాయి.

   Politics

   Lifestyle