HomeTelugu news

రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ కన్నుమూత
Published By :  Lasya Raghavaraju Image Image
RajyaSabha MP Amar singh passed away at 64
Saturday Aug 01, 2020
రాజ్య‌స‌భ సభ్యుడు, యుపి మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమ‌ర్‌సింగ్ (64) శనివారం కనుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నాలుగు నెలలుగా సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. అమర్ సింగ్ కు భార్య పంకజా కుమారీ సింగ్, ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. 

2013లో ఆయన కిడ్నీ సమస్యతో భాదపడి కోలుకున్నారు. 2016లో తిరిగి రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్ననేతగా అమర్ సింగ్ కు పేరుంది. 2020 మార్చిలో ఆయన చనిపోయినట్టు పుకార్లు వచ్చాయి. దీంతో టైగర్ జిందా హై అని అమర్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.   న‌టి జ‌యప్ర‌ద‌కు అమ‌ర్ సింగ్ చాలా స‌న్నిహితులు. జ‌య‌ప్ర‌ద‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చింది అమ‌ర్ సింగే. రాజ‌కీయాల్లో ఆయ‌న్ని గురువుగా భావిస్థారు సీనియ‌ర్ న‌టి జ‌య ప్ర‌ద. 

అమర్ సింగ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

   Politics

   Lifestyle